దీనికి ఒక పోస్టా అని అనుకోకండి. టాబ్లెట్ మింగడం అంటే నాకు తల ప్రాణం తోకకి వచ్చినంత పని.
ఎప్పుడయినా జ్వరంగాని ఏదయినా గాని వచ్చిందంటే.. ఈ టాబ్లెట్ వేసుకోవాలంటే.. పెద్ద సర్కస్ ఫీట్ చెయ్యాల్సిందే.
ముందుగా టాబ్లెట్ నోట్లో వేసుకుని ఆ తరవాత నీళ్ళు వేసుకుని అది లోపలి వెళ్ళాక బయటకి రాక..
నోరంతా చేదుగా అయిపోయి.. ఇంక నరకం వేరే అక్కరలేదు. ఇంకా ఒకటికంటే ఎక్కువ ఉన్నాయంటే, నా కష్టం దేవుడికే తెలియాలి.
గత ముప్పయి సంవత్సరాలు జ్వరం వచినప్పుడల్లా ఇలాగే గడిచిపోయంది. కాని ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మిత్రుడు శామ్యూల్ ఇచ్చిన సలహాతో కధ మారిపోయింది. ఇప్పుడు ఎన్ని బిళ్ళలు అయినా టక టక వేసేసుకోగాలను. నాలాగ సమస్య ఉన్నవాళ్ళు ఇది ఫాలో అయిపోండి.
టాబ్లెట్ వేసుకుని నీళ్ళు తాగటం మాములుగా మనం చేస్తుంటాం. దాని వలన టాబ్లెట్ రుచి మన నోటికి తగులుతుంది. దాని వలన టాబ్లెట్ మీద అసహ్యం పెరుగుతుంది. ఆ తరవాత అది మింగాలని అనిపించదు.
అలా కాకుండా.. ముందు కొంచెం నీళ్ళు నోట్లో పోసుకోండి.. మింగకుండా అలా నోట్లో ఆపండి. ఆ తరవాత తల పైకెత్తి ఆ ఆపిన నీటిలో (గొంతులో) టాబ్లెట్ వేయండి. ఇప్పుడు గుటక వేయండి. దీని వలన మీ నోటికి టాబ్లెట్ రుచి తెలియదు. నీళ్ళతో గుటక వేయడం వలన టాబ్లెట్ మింగినాట్టు కూడా అనిపించదు. ఎటువంటి పరిస్థితులలో కూడా నాలుక మీద టాబ్లెట్ వేసుకోకండి. దాని వలన టాబ్లెట్ రుచి తెలుస్తుంది.
ఈ సలహా ఎవరికైనా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశ్యం తో రాసాను.
ధన్యవాదములు