Thursday, August 12, 2010

హేమ చంద్ర , కారుణ్య ఇప్పుడు శ్రీరాం.. మన సహకారం ఎంత?

మనొడు ఫైనల్స్ కి వచ్చాడు.
ఇంతకముందు కూడా మన కుర్రాళ్లు ఫైనల్స్ కి వచ్చారు. ఎవరికి తీసిపొని విధంగా అద్బుతంగా పాడారు.
కాని ఉత్తారాది వాళ్ళు చూపించె ఆదరణ ముందు, మనం చూపించిన ఆదరణ ఏనుగు ముందు ఎలకలాగ.. అయిపొయింది.
అంతె కాకుండా.. హింది మాట్లాడె రాష్ట్రాలు ఎక్కువగా ఉండటం వలన ఉత్తారాది వాళ్ళకు సునాయాసంగా ఆధిక్యత లభిస్తుంది. కాబట్టి మనం చూపించె ఆదరణ సరిపొదన్నమాట.

ఎం పర్వాలెదు, మనమెమన్న తక్కువున్నామా? పది కొట్ల మంది ఉన్నాం. వెళ్ళు ముడిస్తె పిడికిలి అయినట్టు, అందరు కలిసి మన కుర్రాడిని గెలిపిద్దాం. ఒట్లు వేయండి, ఇంట్లొ, ఆఫిస్ లొ , బంధువులు అందరి చెత వెయించండి. కళను ఆదరించె హౄదయం మనకు ఉందని చాటండి. గుర్తుంచుకోండి ఇంకా ఒక్కరోజు మాత్రమె ఉంది.

sms SREERAM to 52525.
ఓటు వేశారా? అయితే ఈ పోస్టు కి కామెంటు చేయండి.. లేదా.. క్రింద జీమెయిల్ ఐకాన్ మీద క్లిక్ చేసి అందరికి తెలియపరచవచ్చు..

Wednesday, August 11, 2010

డైరెక్టర్ శంఖర్ గారి బ్లాగు

Here is Director Shankar Blog. Check Out
బ్లాగు రాయడమే కాకుండా ఈయన అందరి కామెంట్స్ కి రెస్పాన్సు ఇచ్చే ఏర్పాటు కూడా చేసి బ్లాగు ని చాల బాగా ఉపయోగిస్తున్నారు. మీరు కూడా ఓ.. సారి తిలకించండి..

Wednesday, May 19, 2010

చినుకు చినుకు పడుతూ ఉంటె..

మా ఆఫీసు దగ్గర వర్షం పడింది.. నా చెతిలొ ఫొన్ ఉంది..

ఇంకెముంది.. రెచ్చిపొయానన్నమాట.
 











Wednesday, April 7, 2010

3 Idiots పెద్ద చెత్త సినిమా అంట..

 
ఇది నా మాట కాదండోయ్. నేను కూడా అందరి లాగానే సినిమా చూసి బాగా నవ్వుకుని మరియు సెంటిమెంటు సీన్లకు కంట తడి పెట్టుకుని వచ్చినవాడినే..
కాని నాకు ఈ మధ్య మరొక వర్గం తారస పడింది.. వారి అభిప్రాయం ప్రకారం 3 Idiots పెద్ద Bakwas Movie అంట.
ఎందుకయ్యా అని అడిగితే.. ఈ క్రింది కారణాలు చెప్పారు.

1. సినిమాలో ముగ్గురు స్నేహితులు అని చూపిస్తుంటారు. కాని వారి మధ్య ఆ విధమయిన స్నేహం ఎలా ఏర్పడిందో సరిగా చూపించలేదు.
2.  పది సంవత్సారాల కాలంలో ఒక్క సారి కూడా మాధవన్,శర్మాన్, కరీనా గాని కాలేజ్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ లో అడ్రస్ చూసి అమీర్ ఖాన్ ని కలవాలని ప్రయత్నించలేదా?
౩. పెరాలసిస్ తో ఉన్నా వ్యక్తిని స్కూటర్ మీద వెళ్లాడదీసుకుంటూ వెళ్ళడం ఎంత వరకు సమంజసం.
4 . పేషంట్ ని స్కూటర్ మీద బెడ్డు వరకు తీసుకెళ్ళడానికి ఏ హాస్పిటల్ అనుమతిస్తుంది..?
5 . డిగ్రీలు అన్ని వేరే వారి పేరుతొ చేసిన అమీర్ ఖాన్ 400 పేటెంట్స్ ఎలా రిజిస్ట్రేషన్ చేయించాడు? పేటెంట్ ఏ క్వాలిఫికషన్ లేకుండా రిజిస్ట్రేషన్ చేయించవచ్చా?
6 . చివరికి కరీనా అమీర్ ఖాన్ ని కలిసేటప్పటికి కనీసం తనకి ౩౦ సంవత్సారాలు ఉండాలి. అప్పటి వరకు పెళ్లి చేసుకోకుండా ఉండటం పక్కన పెడితే. అది కూడా ఒక సారి అసహ్యించుకున్న వ్యక్తిని చేసుకోడానికి సిద్దపడటం కూడా పక్కన పెడితే..
ఏ దైర్యం తో ౩౦ సంవత్సారాల అమీర్ ఖాన్ పెళ్లి చేసుకుకోకుండా ఉంటాడు అని అంచనా వేసి పారిపోయి వస్తుంది?
7 . అమీర్ ఖాన్ పై అంత పగ పెట్టుకున్న డీన్, శర్మాన్ మాత్రమె పిలిచి బ్లాక్ మెయిల్ చేసాడు. అమీర్ ఖాన్ డైరెక్ట్ గా పిలిచి రేస్టికేట్ చేయ్యోచుగా.. పైగా.. శర్మాన్ సూసైడ్ కి ప్రయత్నించినప్పుడు ఏ ఎంక్వారి జరగలేదా? అసలు విషయం తెలిసి డీన్ ని తొలగించాలి కదా?
8 . 1978 లో పుట్టాను అని మాధవన్ చెప్పినప్పుడు.. వారు చదువుకునే సమయానికి ఇండియాలో వాయిర్లేస్స్ బ్రాడ్ బాండ్ ఉండే అవకాసం లేదు (Airtel Broad Band USB వాడుతారు సినిమాలో).
9 . పేషంట్ (శర్మాన్)కి అతని బలహీనతలు గుర్తు చేస్తూ ట్రీట్మెంట్ చేయాలనుకోడం సరి అయినా విదానామా?
10 . ఆల్ ఈజ్ వెల్ అనడంతో చలనం లేని శిశువులో చలనం రావడం యాదర్దానికి ఎంత దగ్గరగా ఉంది?
11 . మిస్టర్ వాన్గ్దే ని కలవాడానికి వచ్చిన చతుర్, అది కూడా ఒక ముఖ్యమయిన వొప్పందం కొరకు వచినప్పుడు, వాన్గ్దే ఫోటో ఒక్కసారి కూడా చూడకపోవడం వింతగా ఉంది.
మరికొన్ని చిన్న తప్పులు

టాయిలెట్ లో పడేసిన కలశం మూత మళ్ళి ఎలా వచ్చింది?


పాన్టులోకి పూర్తిగా వంచేసిన నీళ్ళు మళ్ళి బాటిల్ లోకి వచ్చేసాయి.




అలాగే కరీనా వాళ్ళకి అక్క పేరు మొదట్లో పూనం గాను తరవాత మొన గాను పిలవబడుతుంది.

అదన్నమాట సంగతి...  అమీర్ ఖాన్ అభిమానులు ఎవరయినా ఉంటే నా మీద కారాలు మిరియాలు నూరోద్దు.
జస్ట్ చెప్పాను అంతే.. ఈ మేటర్ తో నాకేమి సంబంధం లేదు. ఆల్ ఈజ్ వెల్. ఆల్ ఈజ్ వెల్..

Tuesday, April 6, 2010

Confused With Air Cooler..

ఎండలు మండిపోతున్నాయి.. పగలు రాత్రి తేడా లేకుండా.. ఒకటే ఉక్క..
చిన్న పిల్లలకు మరియు పెద్ద వారికి చాల సమస్య గా ఉంది.
అయితే Air Coolers కి ఇదే గిరాకి సమయం..
అవసరానికి కొనాలి కాబట్టి ఏదో నాలుగు మాటలు చెప్పి అంట గట్టేస్తారు షాపు వాళ్ళు.. కొన్నాక అది పని చేయకపోతే..
వొళ్ళు మండిపోయి.. బయట వేడి తో పాటు లోపల వేడి కూడా తోడవుతుంది..




మీలో చాల మంది  వాడుతూ ఉండి ఉంటారు కదా..
మీ అనుభవాలని పంచుకుంటే.. వినియోగదారులకు కొంచెం ఉపయోగకరంగా ఉంటుంది.
సిమ్ఫోని, బజాజ్, ఉష బాగా వినపడే పేర్లు..
మీరు కొన్న బ్రాండు, పని తీరు, ఖరీదు, కొన్న చోటు మొదలయిన వివరాలు అందించండి..
కోనేవాళ్ళకు ఒక నిర్ణయం తీసుకోడానికి బాగుంటుంది.
ధన్యవాదాలు.

Monday, April 5, 2010

గీతాంజలి హీరోయిన్ గిరిజ గారి బ్లాగ్

This is Geethanjali Herion 'Girija's Personel Blog.

Found in Other Friends Blog. I am trying to high light it.
In the Same way I will try to collect Popular People Blogs. Let Start With Girija Shettar...

















Monday, March 22, 2010

మ్యాగి తో రెండు నిమిషాల అనుభవం..

మ్యాగి అంటే.. అమ్మాయి కాదండోయ్..  మ్యాగి న్యూడుల్స్..
మీరేవరయినా మ్యాగి ఇన్స్టా - న్యూడుల్స్ తిన్నారా? (Maagi Insta-Noodles). నేను ఇవాళే తిన్నాను...
ఏదో మేస్సుకి వెళ్ళే వోపిక లేక.. కొత్తగా ప్రయోగం చేద్దామని.. రెండు కప్పులు తీసుకొచ్చా...
ఇందులో చేసేది ఏమీ లేదు.. చాలా వీజీ... జస్ట్ వేడి నీళ్ళు కలిపి.. అయిదు నిమిషాలు ఆగి తినేయ్యడమే..
మామూలు మాగి లాగా ఉంటుంది అనుకున్నా...


నోట్లో పెట్టుకున్నాను కాదు... చాల దరిద్రంగా.. ఉంది.. చప్పగా. అందులో కాస్త ఉప్పుకారం గట్టిగా తినే అలవాటేమో.. అసలు సహించలేదు.. చివరికి ఆ కప్పు బయట చెత్త కుప్పలో పారేసి వచ్చి.. పదకొండు గంటలప్పుడు.. ఎక్కడికి వెళ్ళలేక.. అలాగే పస్తు పోడుకోబోతున్న మాస్టారు.


ఇంతకీ.. నే చెప్పోచ్చేదేంటి అంటే..


నా లాగా ఉప్పుకారం.. గట్టిగా (ఐ మీన్ ఎక్కువగా..) తినే వారు ఉంటె..
దీని జోలికి పోకండి..
నాకు వచ్చిన కష్టం.. ఏ పగవాడికి కూడా రాకూడదు అని.. ఇలా ముందస్తు వార్నింగ్ ఇస్తున్నా అన్నమాట..