Wednesday, April 7, 2010

3 Idiots పెద్ద చెత్త సినిమా అంట..

 
ఇది నా మాట కాదండోయ్. నేను కూడా అందరి లాగానే సినిమా చూసి బాగా నవ్వుకుని మరియు సెంటిమెంటు సీన్లకు కంట తడి పెట్టుకుని వచ్చినవాడినే..
కాని నాకు ఈ మధ్య మరొక వర్గం తారస పడింది.. వారి అభిప్రాయం ప్రకారం 3 Idiots పెద్ద Bakwas Movie అంట.
ఎందుకయ్యా అని అడిగితే.. ఈ క్రింది కారణాలు చెప్పారు.

1. సినిమాలో ముగ్గురు స్నేహితులు అని చూపిస్తుంటారు. కాని వారి మధ్య ఆ విధమయిన స్నేహం ఎలా ఏర్పడిందో సరిగా చూపించలేదు.
2.  పది సంవత్సారాల కాలంలో ఒక్క సారి కూడా మాధవన్,శర్మాన్, కరీనా గాని కాలేజ్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ లో అడ్రస్ చూసి అమీర్ ఖాన్ ని కలవాలని ప్రయత్నించలేదా?
౩. పెరాలసిస్ తో ఉన్నా వ్యక్తిని స్కూటర్ మీద వెళ్లాడదీసుకుంటూ వెళ్ళడం ఎంత వరకు సమంజసం.
4 . పేషంట్ ని స్కూటర్ మీద బెడ్డు వరకు తీసుకెళ్ళడానికి ఏ హాస్పిటల్ అనుమతిస్తుంది..?
5 . డిగ్రీలు అన్ని వేరే వారి పేరుతొ చేసిన అమీర్ ఖాన్ 400 పేటెంట్స్ ఎలా రిజిస్ట్రేషన్ చేయించాడు? పేటెంట్ ఏ క్వాలిఫికషన్ లేకుండా రిజిస్ట్రేషన్ చేయించవచ్చా?
6 . చివరికి కరీనా అమీర్ ఖాన్ ని కలిసేటప్పటికి కనీసం తనకి ౩౦ సంవత్సారాలు ఉండాలి. అప్పటి వరకు పెళ్లి చేసుకోకుండా ఉండటం పక్కన పెడితే. అది కూడా ఒక సారి అసహ్యించుకున్న వ్యక్తిని చేసుకోడానికి సిద్దపడటం కూడా పక్కన పెడితే..
ఏ దైర్యం తో ౩౦ సంవత్సారాల అమీర్ ఖాన్ పెళ్లి చేసుకుకోకుండా ఉంటాడు అని అంచనా వేసి పారిపోయి వస్తుంది?
7 . అమీర్ ఖాన్ పై అంత పగ పెట్టుకున్న డీన్, శర్మాన్ మాత్రమె పిలిచి బ్లాక్ మెయిల్ చేసాడు. అమీర్ ఖాన్ డైరెక్ట్ గా పిలిచి రేస్టికేట్ చేయ్యోచుగా.. పైగా.. శర్మాన్ సూసైడ్ కి ప్రయత్నించినప్పుడు ఏ ఎంక్వారి జరగలేదా? అసలు విషయం తెలిసి డీన్ ని తొలగించాలి కదా?
8 . 1978 లో పుట్టాను అని మాధవన్ చెప్పినప్పుడు.. వారు చదువుకునే సమయానికి ఇండియాలో వాయిర్లేస్స్ బ్రాడ్ బాండ్ ఉండే అవకాసం లేదు (Airtel Broad Band USB వాడుతారు సినిమాలో).
9 . పేషంట్ (శర్మాన్)కి అతని బలహీనతలు గుర్తు చేస్తూ ట్రీట్మెంట్ చేయాలనుకోడం సరి అయినా విదానామా?
10 . ఆల్ ఈజ్ వెల్ అనడంతో చలనం లేని శిశువులో చలనం రావడం యాదర్దానికి ఎంత దగ్గరగా ఉంది?
11 . మిస్టర్ వాన్గ్దే ని కలవాడానికి వచ్చిన చతుర్, అది కూడా ఒక ముఖ్యమయిన వొప్పందం కొరకు వచినప్పుడు, వాన్గ్దే ఫోటో ఒక్కసారి కూడా చూడకపోవడం వింతగా ఉంది.
మరికొన్ని చిన్న తప్పులు

టాయిలెట్ లో పడేసిన కలశం మూత మళ్ళి ఎలా వచ్చింది?


పాన్టులోకి పూర్తిగా వంచేసిన నీళ్ళు మళ్ళి బాటిల్ లోకి వచ్చేసాయి.




అలాగే కరీనా వాళ్ళకి అక్క పేరు మొదట్లో పూనం గాను తరవాత మొన గాను పిలవబడుతుంది.

అదన్నమాట సంగతి...  అమీర్ ఖాన్ అభిమానులు ఎవరయినా ఉంటే నా మీద కారాలు మిరియాలు నూరోద్దు.
జస్ట్ చెప్పాను అంతే.. ఈ మేటర్ తో నాకేమి సంబంధం లేదు. ఆల్ ఈజ్ వెల్. ఆల్ ఈజ్ వెల్..

10 comments:

  1. aare... I didn't thought of these ... thts gave me 330 crores.. so leave it man.... whatever .. I got money[:)]... who cares quality... its making people stay joyfull..

    ReplyDelete
  2. Whats the spelling of Teacher's day ?

    ReplyDelete
  3. Mads,

    Teachers' day

    ReplyDelete
  4. hi hi heeeeeeeeeeeee..good analysis....

    ReplyDelete
  5. all of them are valid points. Neverthless it is good movie which encourages people to choose the right path. to take up their passion as their profession.

    ReplyDelete
  6. Thanks for revealing these late!

    ReplyDelete
  7. టేకింగ్ పరంగా చెత్త అయివుండొచ్చు, కానీ అద్భుతమైన కాన్సెప్టును అంతకంటే గొప్పగా చెప్పారు. మన దిక్కుమాలిన విద్యావ్యవస్థ ఎంత హీనంగా ఉందో చెళ్ళున కొట్టినట్టు చూపించారు. అంతవరకు సినిమా అద్భుతమే.

    ReplyDelete
  8. మీరు చెప్పినవాటిని "గూఫ్ అప్స్" అంటారు. ఆస్కార్ అవార్డు అందుకున్న చిత్రాల్లోకూడా ఇలాంటి తప్పులుంటాయి. అంతమాత్రానా సినిమా ప్రేక్శ్ఃఅకులతో చేయించిన ఏమోషనల్ జర్నీ తక్కువ కాదుకదా!

    ReplyDelete
  9. టీచర్స్ డే విషయం తొలిగించాను. నేను కూడా సరిగా చూడలేదు. అందరి రెస్పాన్స్ కి కృతఙ్ఞతలు..

    ReplyDelete