ఎండలు మండిపోతున్నాయి.. పగలు రాత్రి తేడా లేకుండా.. ఒకటే ఉక్క..
చిన్న పిల్లలకు మరియు పెద్ద వారికి చాల సమస్య గా ఉంది.
అయితే Air Coolers కి ఇదే గిరాకి సమయం..
అవసరానికి కొనాలి కాబట్టి ఏదో నాలుగు మాటలు చెప్పి అంట గట్టేస్తారు షాపు వాళ్ళు.. కొన్నాక అది పని చేయకపోతే..
వొళ్ళు మండిపోయి.. బయట వేడి తో పాటు లోపల వేడి కూడా తోడవుతుంది..
మీలో చాల మంది వాడుతూ ఉండి ఉంటారు కదా..
మీ అనుభవాలని పంచుకుంటే.. వినియోగదారులకు కొంచెం ఉపయోగకరంగా ఉంటుంది.
సిమ్ఫోని, బజాజ్, ఉష బాగా వినపడే పేర్లు..
మీరు కొన్న బ్రాండు, పని తీరు, ఖరీదు, కొన్న చోటు మొదలయిన వివరాలు అందించండి..
కోనేవాళ్ళకు ఒక నిర్ణయం తీసుకోడానికి బాగుంటుంది.
ధన్యవాదాలు.
ఎయిర్ కూలెర్ ఏదైనా కొనండి. కాని అది arrange చేసే పద్ధతి ఇది. నేను నాగపూర్ లో disert coolers చూసిన/వాడిన అనుభవముతో చెబుతున్నాను.
ReplyDelete1 ) మీకు బాల్కనీ ఉంటే ఒక కిటికీ దగ్గర ఉంచండి. కూలెర్ output కిటికీ లోంచి మీ రూము లోకి రావాలి. కిటికీ లో ఏమైనా gaps ఉంటే అట్టలతో మూసేయండి. కూలెర్ రూములో పెట్టు కుంటే humidity పెరగటము, జలుబులు రావటం పక్కా
2 ) ఒకే కూలెర్ ఒకటికన్నా ఎక్కువ రూములు చల్ల పరచగలదు. కాకపోతే మీరు వచ్చే కూలెర్ గాలిని రెండో రూములోకి మరల్చే విధముగా తలుపులు & కిటికీలు మూయటమో తెరవటమో చేయాలి.
3 ) కనీసం 4 బకెట్లు నీళ్ళు పట్టే కూలెర్ కొనండి. లేక పోతే అర్ధరాత్రి లేచి నీళ్ళు నింపుకోవాలి.
మీ విలువయిన సమాచారానికి చాల చాలా థాంక్స్. కూలర్ వాడకంలో మీ సలహాలు తప్పక ఉపయోగపడతాయి.
ReplyDelete